calender_icon.png 8 July, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎం గోదాం తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

07-07-2025 05:59:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) సోమవారం కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాం కేంద్రాన్ని నెలవారీ సాధారణ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలోని అన్ని రిజిస్టర్లు, భద్రతా ప్రమాణాలను ఆమె సమీక్షించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో గోదాం భద్రత నిరంతరంగా కొనసాగించాలని కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం గోదాం ప్రాంగణంలో వనమహోత్సవంలో భాగంగా అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు గజానంద్, సిబ్బంది రాజశ్రీ, తదితరులు పాల్గొన్నారు.