calender_icon.png 8 July, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలి

07-07-2025 05:56:56 PM

బైంసా (విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్(Students Federation of India) తానూర్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 8000 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని తానూర్ పట్టణంలో విద్యార్థులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిరసన తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా దిగంబర మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంలో పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఇబ్బందులకు గురి అయ్యే సందర్భాలు కనిపించడం జరిగింది.

కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి. స్కాలర్‌షిప్‌లకు సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లు మంజూరు చేయాలి. లేనియెడల భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేద విద్యార్థులకు న్యాయం జరిగేలా చేయాలి లేని పక్షాన విద్యార్థుల తో కలిసి పోరాడుతాం కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులువిజయ్, చరణ్, సమీర్, సాయి, ప్రవీణ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.