27-09-2025 12:41:01 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): భారతదేశంలో నిద్రవిషయంలో ప్రత్యేకత సాధించిన సెంచురీ మాట్రెసెస్ ఇప్పుడు సోపాల విభాగంలోకి ప్రవేశించింది. వీటిని కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ పీవీసింధు హైదరాబాద్‌లో ఆవిష్కరిం చారు. సెంచురీ సంస్థ ఆధునిక డిజైన్లు, కంఫర్ట్ సైన్స్ రెండింటినీమిళితం చేసి ఒక విభిన్నమైన సౌకర్యాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇందులో 3 సీటర్, 2 సీటర్, సింగిల్ సీటర్, ఇంకా పొడవైన యూనిట్లు కూడాఉన్నాయి. వేర్వే రు ధరల్లో ఇవి అందుబాటులో ఉన్నా యి. ఈ సందర్భంగా సెంచురీ సోఫాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్మలానీ మాట్లాడుతూ.. “గత 30 ఏళ్లుగా స్లీప్ కంఫర్ట్కుమారుపేరుగా, విశ్వసనీయమైన బ్రాండుగా సెంచురీ ఉంది. మాప్రయాణంలో సోఫాలకు విస్తరించడం మా ప్రయా ణంలో చాలాసహజమైన పురోగతి. సోఫా లు అనేవి కేవలం ఫర్నిచర్ కాదు.
అవి కుటుంబజీవితానికి, సమగ్ర ఆరోగ్యానికి కేంద్రస్థానం. ఇన్నాళ్లుగా కొన్ని కోట్ల కుటుంబా లకు మా పరుపులతో ఇచ్చినవిశ్వాసం, సౌక ర్యం ఇప్పుడూ ఇస్తామని చెప్పడానికి గర్వం గా ఉంది” అన్నారు. కష్టపడి పనిచేయడంతో పాటు విశ్రాంతి, కోలుకోవడం కూడా అంతే ముఖ్యమని నేనెప్పుడూ విశ్వసిస్తానని పీవీ సింధు అన్నారు.
సోఫాల విభాగంలోకి విస్తరించాలన్న సెంచురీ నిర్ణయం ఇంట్లోని ప్రతి మూలనూ సౌకర్యవంతంగా రూపొందించాలన్న వారి నిబద్ధతకు నిదర్శనం అన్నారు. సెంచురీ సోఫాలు మేక్ ఇన్ ఇండియా అనే స్ఫూర్తిని అందిపుచ్చుకుంది. కంపెనీకి చెంది న రిటైల్ నెట్వర్క్, ఎక్స్పీరియెన్స్ సెం టర్లు, మల్టీబ్రాండ్ ఔట్లెట్లు, ప్రత్యేక స్టోర్లు, ఆన్లైన్ ప్లాట్ఫాంలతో పాటు www.centuary india.com ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలోఅందుబాటులో ఉంటాయి.