27-09-2025 04:18:59 PM
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..
వేములవాడ టౌన్ (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. మున్సిపల్ కార్యాలయం నుండి మూలవాగు బతుకమ్మ తెప్ప వరకు అమ్మవారి ఊరేగింపుతో ప్రారంభమైన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతిని ఆరాధించే గొప్ప పండగ బతుకమ్మ. అమ్మవారిని దర్శించుకుని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, పాడిపంటలు బాగా పండిపోవాలని ప్రార్థించాను” అని తెలిపారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో బతుకమ్మ, దసరా వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. గతంలో 700 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తే, ఈసారి వెయ్యి దీపాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో వేడుకల్లో పాల్గొనాలని కోరుతూ ముందస్తుగా బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేనేజర్ సంపత్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.