27-09-2025 04:08:57 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని అతి ప్రాచీన దేవాలయమైన అడెల్లి పోచమ్మ గంగ నీళ్ల జాతరకు పోలీస్ భద్రతలు చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శని ఆదివారాల్లో రెండు రోజులపాటు నిర్వహించి ఈ జాతరకు దిల్వార్పూర్ సారంగాపూర్ అడెల్లి గ్రామంలో పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సంఘీవద్ద నగల స్థానాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నందున అక్కడి ప్రాంతాలను పరిశీలించి రక్షణ చర్యలపై సూచనలు చేశారు. ఆదివారం జరిగే జాతరకు భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలకుండా పోలీసు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.