27-09-2025 04:00:42 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్ (విజయక్రాంతి): చేనేత కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Vijaya Ramana Rao) అన్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శనివారం సుల్తానాబాద్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సుల్తానాబాద్ నుండి చేనేత సహకార సంఘం, పద్మశాలి సంఘం ప్రతినిధి బృందాన్ని సీఎం, మంత్రి తుమ్మల వద్దకు తీసుకువెళ్లి చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు గుండా మురళి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మినుపాల ప్రకాశరావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అధ్యక్షుడు చీకట్ల మొండయ్య, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు సాయిరి మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అయిల రమేష్, జిల్లా పద్మశాలి సంఘం యువజన విభాగం అధ్యక్షుడు మేరుగు యాదగిరి, బిరుదు కృష్ణ దీకొండ భూమేష్, ఏజిపి దూడం ఆంజనేయులు, గురు స్వామి మిట్టపల్లి మురళి, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ , గోలి శ్రీనివాస్, సామల హరికృష్ణ, సామల రాజేంద్రప్రసాద్, పన్నాల రాములు, మేరుగు వెంకటేశం, అమిరిశెట్టి రాజలింగం, ఆడెపు సదానందం, ఎలిగేటి రమేష్, గోలి శ్రీనివాస్, కామని వెంకటరమణ, పల్లా సురేష్, మేడి శ్రీనివాస్, విష్ణు, వసీం, గాదాసు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి సంఘం నాయకులను సన్మానించిన మిట్టపల్లి ప్రవీణ్ కుమార్
సుల్తానాబాద్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో శనివారం జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో భాగంగా పద్మశాలి సంఘం నాయకులను మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ శాల్వాల్ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ను పద్మశాలి సంఘం నాయకులు సన్మానించడం జరిగింది.