calender_icon.png 27 September, 2025 | 5:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న శార్వాణి కూచిపూడి నాట్య ప్రదర్శన..

27-09-2025 03:57:07 PM

శార్వాణిని అభినందించిన అనంతరెడ్డి దంపతులు..

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అమ్మవారి వద్ద ఆ గ్రామ ప్రముఖ అర్చకులు చంద్రశేఖర్ శర్మ లలిత దంపతుల మనవరాలు శార్వాణి చేసిన కూచిపూడి నాట్య ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కాసర్ల అనంతరెడ్డి అంజలి దంపతులు శార్వాణికి మెమొంటో అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.