calender_icon.png 27 September, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాట స్ఫూర్తిలో నిప్పురవ్వ.. చాకలి ఐలమ్మ

27-09-2025 12:41:06 AM

మణుగూరు, సెప్టెంబర్ 26,( విజయక్రాంతి) : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిలించిన నిప్పురవ్వ చాకలి ఐలమ్మ అని రజక ఐక్యవేదిక నాయకులు కొని యాడారు. ఐలమ్మ జయంతి వేడుకలనుశుక్రవారం రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుండి, బస్టాండ్, బొంబాయి కాలనీ మీదుగా హనుమాన్ టెంపుల్ ఐలమ్మ తల్లి విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ సాగింది. పలువురు సంఘం నాయకులుఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ఆ సంఘం నాయకులు పున్నం బిక్షపతి మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర మరువలేనిదన్నారు. రజక కుటుంబంలో పుట్టిన ఒక ఆడపడుచు దొరల దోపిడిని ఎదిరించి పోరాడింద న్నారు. వెట్టి చాకిరీ చేయొద్దని పిలుపు నిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మని,దున్నేవాడిదే భూమి అని సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చురుకుగా పాల్గొన్నారని, నిజాం పాలనలో వెట్టిచాకిరితో మగ్గిపోయిన అణగారిన వర్గాల బతుకులను బాగు చేయడానికి , పరిరక్షించడానికి తుపాకులు పట్టి నిజాంకు , ఆనాటి దొరలకు వ్యతిరే కంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిపిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని మహిళలు వారిపై జరుగుతున్న అన్యాయాలకు, ఆకృత్యాలకు వ్యతిరే కంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమామ హేశ్వర రావు, అక్కినపల్లి సత్యనారాయణ,ముజాకర్, దుగ్గీ బ్రహ్మ తేజ, రాపర్తి శ్రీహరి, పొనుగంటి కృష్ణ, సట్టు యాకయ్య, అప్పయ్య, రామ్మూర్తి, రజక ఐక్యవేదిక సభ్యు లు పాల్గొన్నారు.