04-12-2025 06:20:13 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని పారమిత ఉన్నత పాఠశాల స్కాట్స్ అండ్ గైడ్స్ నవంబర్ 23 నుండి 29 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో నిర్వహించిన 19వ జాతీయ స్థాయి జంబూరి క్యాంపులో 10 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. జాతీయ స్థాయి జంబూరి క్యాంపులో భాగంగా నవంబర్ మాసంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో "వికసిత్ యువ - వికసిత్ భారత్" అనే నినాదంతో నిర్వహించిన జంబూరి క్యాంపుకు కరీంనగర్ జిల్లా నుండి 18 మంది విద్యార్థులను ఎంపిక చేయగా అందులో పారమిత పాఠశాల నుండి 9వ తరగతి చదువుతున్న పి. శ్రీనిక, పి. శ్రీజై 8 వ తరగతి చదువుతున్న అర్ దివిజ, పి. వర్ణిక, కె. శ్రీహిత, ఎమ్. సాన్విక, కె. కీర్తి చైతన్య, ఎమ్. తనుశ్రీ, సి.హెచ్. సమర్ద్, కె. రాజేష్ లు గైడ్ కెప్టెన్ రజిత ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో జరగిన జంబూరి క్యాంపుకు ఎంపిక కావడం జరిగింది.
వారం రోజలపాటు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్, జానపద నృత్యాలు, బి. పి. ఎక్సర్సయిజ్, క్యాంప్ క్రాఫ్ట్, రంగవల్లి, డ్రాయింగ్, శారీరక సామర్త్య పరీక్షలు మొదలగు పోటీలలో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో పాల్గొని విజయాలు సాధించిన విధ్యార్థిని విధ్యార్థులకు పాఠశాలలో జరిగిన అభినందన సభలో పాఠశాల అధినేత డాక్టర్ ఇ. ప్రసాదరావు మెరిట్ సర్టిఫికెట్స్ ప్రధానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రసూన, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, వి. యు.యం ప్రసాద్, హనుమంతరావు, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజి, కవిత సమన్వయ కర్త శ్రీనాథ్, గైడ్ కెప్టెన్ రజిత, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు స్కౌట్స్ అండ్ గైడ్స్ విధ్యార్థులను అభినందించారు.