16 April, 2026 | 6:12 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దంతూరి సత్తయ్యకి ఘన సన్మానం

04-12-2025 06:26 PM

- సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా బాధ్యతల స్వీకరణ..

- ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష హాజరు..

చిట్యాల (విజయక్రాంతి): రామన్నపేట అదనపు కోర్టుకి సెకెండ్ క్లాస్ మేజిస్ట్రేట్ గా ఎంపికై బాధ్యతలు చేపట్టిన దంతూరి సత్తయ్యకి రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ.మస్జిద్ అధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి సభ్యులందరూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష హాజరయ్యారు. అనంతరం వారూ మాట్లాడుతూ జ్యుడిషియల్ వ్యవస్థలో నిబద్దతతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఉంటాయని అన్నారు.

అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మాతో పాటు కలసి పని చేసిన ఉన్నత హోదాలో వెల్లినందున సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ యాపాల కృష్ణ రెడ్డి, కంపాటి యాదగిరి, జినుకల ప్రభాకర్, కేమా రామదాసు, ఉయ్యాల హనుమంతు గౌడ్, బర్ల డేవిడ్, నకిరేకంటి మోగులయ్య, యాదాసు యాదయ్య, దినేష్ కుమార్, మామిడి వెంకట్ రెడ్డి, నోముల స్వామి, ఏళ్ల శ్రీశైలం, కూనురూ శ్రీనివాస్, ఎండీ.అజిజోద్దిన్, మహిళ న్యాయవాది రజియా బేగం, తదితరులు పాల్గొన్నారు.