25న గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన సదస్సు
పోస్టర్ విడుదల చేసిన టీఎన్జీవో నేతలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్ ఉద్యోగినుల కోసం ఈ నెల 25న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అవగాహన సదస్సు పోస్టర్‌ను బుధవారం తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, హైదరాబాద్ జిల్లా కమి టీ యూనియన్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరిలో ఈ అత్యంత కీలకమైన ఆరోగ్య సమస్యపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దే శం.
ఈ కార్యక్రమానికి తెలంగాణ నాన్-గెజి టెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు మారమ్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డా. ఎస్.ఎం. హుస్సేని (ముజీబ్) హాజరయ్యారు. టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్య క్షుడు విక్రమ్ కుమార్, కార్యదర్శి కూరాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. మారమ్ జగదీశ్వర్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగుల సంక్షేమం కోసం టీఎన్జీఓ యూనియన్ నిరంతరం కృషి చేస్తోంది. ముఖ్యంగా, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వంటి నివారిం చదగిన వ్యాధులపై మహిళా ఉద్యోగులకు అవగాహన కల్పించడం అనేది ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తొలి మెట్టు.
ఉద్యోగినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి‘ అని పిలుపునిచ్చారు. ముజీబ్ మాట్లాడుతూ.. ‘మహిళా ఉద్యోగులు తమ పని ఒత్తిడిలో వ్యక్తిగత ఆరోగ్యా న్ని, ముఖ్యంగా స్క్రీనింగ్ పరీక్షలను నిర్లక్ష్యం చేయవద్దు. గర్భాశయ ముఖద్వార క్యాన్స ర్ను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు’ అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ నుంచి ముత్యాల సత్యనారాయణ గౌడ్ (కోశాధికారి), కొండల్‌రెడ్డి, ఉమ, శైలజ (సెంట్రల్ యూనియన్ ప్రతినిధులు) పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా యూనియన్ నుండి కె. ఆర్. రాజ్ కుమార్ (జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్), ఖాలెద్ అహ్మద్, శంకర్, వైదిక్ శ్రేష్ఠ, శ్రీధర్, ముఖీమ్ ఖురేషీ (జిల్లా ప్రతినిధులు) పాల్గొన్నారు.






