8 March, 2026 | 3:42 PM

Breaking News

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు   •   ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •  

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

20-02-2026 12:10 AM
  1. నిందితుల్లో ఒకరు మహిళ
  2. సొత్తు స్వాధీనం

జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు సాఫ్ట్వేర్ ఇంజినీర్ మెడలో నుంచి గొలుసు ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ నేరానికి పాల్పడిన కాకినాడకు చెందిన చెశెట్టి రేవతి (33), గుంటూరుకు చెందిన రాపిడో డ్రైవర్ గిద్దల నరేంద్ర అలియాస్ నాని (23)లను అరెస్ట్ చేసినట్లు జుబ్లీహిల్స్ ఎస్హెచ్‌ఓ యు.శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు.

ఈ నెల 17న ఉదయం కడపకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కడపాల మానస రోడ్ నంబర్ 39లోని తన కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసు కుంది. రోడ్ నంబర్ 44 వద్ద ద్విచక్ర వాహనంపై వచ్చిన నిందితులు ఆమెను వెంబడిం చారు. నరేంద్ర వాహనాన్ని నడుపుతుండగా వెనుక కూర్చున్న రేవతి మహిళ మెడలోని 10 గ్రాముల బంగారు గొలుసును తెంచుకొని బండిపై ఇద్దరూ పరార య్యారు.

బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సిసిటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు తులం బంగా రు గొలుసు, నేరానికి ఉపయోగించిన స్కూటర్ రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితులు ప్రస్తుతం సనత్ నగర్లోని హిందూ పబ్లిక్ స్కూల్ సమీపంలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.