calender_icon.png 20 February, 2026 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాపై ఆరోపణలు నిరూపించండి

20-02-2026 12:09:38 AM

  1. లేదంటే బహిరంగ క్షమాపణ కోరండి
  2. ఐపీఎస్ అసోసియేషన్‌కు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేఖ

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య వివాదం ముదిరింది. గత నెల 30న ఐపీఎస్ అసోసియేషన్ తనపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి గురువారం ఆ సంఘం సెక్రటరీకి ఘాటుగా లేఖ రాశారు. తనపై చేసిన నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలకు  ఐపీఎస్ అసోసియేషన్ బేషరత్‌గా బహిరంగ క్షమాపణ చెప్పా లని ఆయన డిమాండ్‌చేశారు. మూడు రోజుల్లోగా స్పం దించని పక్షంలో అసోసియేషన్ సభ్యులందరిపై సివిల్,  క్రిమినల్ చర్యలు తీసుకుం టాన ని హెచ్చరించారు.

గత నెల 30న ఐపీఎస్ అసోసియేషన్ ఒక ప్రెస్ రిలీజ్  విడుదల చేస్తూ ఐపీఎస్ అధికారి గౌష్ ఆలం పట్ల ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది. విధుల్లో ఉన్న అధికారి మతాన్ని ప్రస్తావిస్తూ, ఆయన ఇతర మతస్థులను మత మార్పిడి చేస్తున్నారని కౌశిక్‌రెడ్డి ఆరోపించినట్లు అసోసియేషన్ పేర్కొంది. ఇది సివిల్ సర్వీసెస్ గౌరవానికి భంగం కలిగించడమేనని ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ ఆరోపణలను కౌశిక్‌రెడ్డి తోసిపుచ్చారు. తానేనాడు అటువంటి వ్యాఖ్యలు చేయలేదని, అసోసియేషన్ చేసినవన్నీ పచ్చి అబద్ధాలని ఆయన మండిపడ్డారు. ఏళ్ల తరబడి కష్టపడి, ప్రజలకు సేవ చేస్తూ సంపాదించుకున్న నా పేరును, ప్రతిష్టను మంటగలిపేలా ఐపీఎస్ అసోసియేషన్ వ్య వహరిస్తోందన్నారు. దీనివల్ల కలిగే పర్యవసానాలకు, న్యాయపరమైన ఖర్చులకు అసో సియే షన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.