17-12-2025 08:10:59 AM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పెళ్లి పత్రిక ఇవ్వాలని ఇంటికి వచ్చిన ఓ దుండగుడు ఓ మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మెడలో ఉన్న పుస్తెలతాడును లక్కేల్లాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈశ్వర్ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలోని ఈశ్వర్ కాలనీలో నివాసం ఉంటున్న చంద్రకళ అనే మహిళ ఇంట్లో టీవీ చూస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి పెళ్లి కార్డు ఇవ్వడం కోసం వచ్చానంటూ డోర్ కొట్టాడు.
డోర్ తెరిచిన వెంటనే మహిళపై దాడి చేస్తూ నోట్లో గుడ్డలుకుక్కి తన మెడలో ఉన్న 2తులాల బంగారు పుస్తెలతాడు బలవంతంగా లాక్కెళ్లాడు. ఈ పెనుగులాటలో మహిళ మెడపై గాయమైంది. వెంటనే కుటుంబ సభ్యులకు తెలపడంతో పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం జిల్లా జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందారు విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు.