calender_icon.png 17 December, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గపాడులో మౌలిక వసతులు పూర్తి చేయండి

17-12-2025 01:49:48 AM

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బుగ్గ పాడు పారిశ్రామికవాడలో మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మంగళవారం టిజిఐఐసి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ హించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజ య్ కుమార్ కూడా పాల్గొన్నారు.

బుగ్గపాడులోని 200 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్కు, తెలంగాణా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, ఎంఎస్‌ఎంఇ జోన్‌లను టిజిఐఐసి ఏర్పాటు చేసిం ది. ఇక్కడ పరిశ్రమ లు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నం దున త్వరితగ తిన ఏర్పాట్లన్నీ పూర్తిచేయాలని శ్రీధర్‌బాబు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులో జనవరిలో పరిశ్రమల నిర్మాణా లు మొదలయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. మెగా ఫుడ్ పార్కుకు కేటాయిం చిన 60 ఎకరాల్లో యూనిట్ల నిర్మాణాలను ప్రారంభించేలా భూకేటాయింపులు పొంది న వారిని కోరాలని తెలిపారు. 

తెలంగాణా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను 80 ఎకరాలు, ఎంఎస్ ఎంఇ జోన్‌ను 60 ఎకరాల్లో ఏర్పా టు చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జో న్‌లో కొత్తగా వ్యవసాయ, అక్వారంగ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సమావేశంలో టిజిఐఐసి ఎండి శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, డైరెక్టర్ (ఇన్ వెస్ట్ మెంట్స్) మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.