17-12-2025 01:29:53 AM
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి) : -రామగుండంలో ఉత్పత్తి అయ్యే ఎరువుల్లో సింహభాగం తెలంగాణకే కేటాయించాలని పరిశ్రము, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సచివాల యంలో పరిశ్రము, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రామగుండం ఎరువుల కర్మాగారం అధికారులతో యూరియా ఉత్పత్తిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఉత్పత్తిలో ఎటువంటి అవంతరాలు వచ్చి నా, ప్రత్యామ్నయ ప్రణాళికతో సిద్ధంగా ఉం డాలని, గతంలో ఏర్పడిన ఆటంకాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఎన్‌సీఎల్ కంపెనీ ప్రతినిధులకు మంత్రులు సూ చించారు. కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ నుంచి 2,05,315 మెట్రిక్ ట న్నుల ఎరువుల కేటాయింపులకు గాను కేవలం 1,10,720 మెట్రిక్ టన్నులు మా త్రమే సరఫరా కావడం వల్ల లోటు ఏర్పడిందన్నారు.
ఈ లోటును భర్తీ చేయాలని కేం ద్రాన్ని పలుమార్లు కోరినప్పటికీ సమయానికి స్పందన లేకపోవడం వల్ల రైతులు నష్టపోయారని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రా మగుండంలో నెలకు సుమారు లక్ష టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నప్పటికీ తెలంగాణకు కేవలం 40 నుంచి 50 శాతం మా త్రమే కేటాయింపులు జరుగుతున్నాయన్నా రు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 70 శాతం అయినా తెలంగాణకే కేటాయిస్తే రవాణా ఖర్చులు తగ్గి, రైతులకు వేగంగా ఎరువులు అందించవచ్చని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
రబీ సీజన్‌కు సం బంధించి ఆర్‌ఎఫ్‌సీఎల్ తీసుకుంటున్న చర్యలు, ఉత్పత్తిలో ఎలాంటి ఆటంకాలు రా కుండా చేపడుతున్న ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్‌బాబు ఆరా తీశారు. డిసెంబర్ నెలలో కూడా 50,450 మెట్రిక్ టన్నుల సరఫరా చేయనున్నట్లు అధికారులు తెలిపారు. స మావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమల శాఖ ఎండీ, టీఎస్‌ఐడీసీ ఎండీ, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.