పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచాలి
12-08-2026 12:27 AM
నాణ్యమైన వైద్యం, రక్త పరీక్షలు తప్పనిసరి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
పెద్దమందడి, ఆగస్టు 11 (విజయక్రాంతి): పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం పెద్దమందడి పీహెచ్సీని తనిఖీ చేసిన ఆయన గర్భిణుల రికార్డులు, లేబర్ రూమ్ను పరిశీలించారు. అనీమియా పరీక్షలు నిర్వహించి, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారికి మందులు, పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు. జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో వచ్చే వారికి రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు.






