18-09-2025 01:47:29 AM
గుత్తా సుఖేందర్‌రెడ్డి
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు జోహార్లు అని రాష్ట్ర శాసనమండలి పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.
ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా యాదాద్రి కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆయన ఎగురవేసి మాట్లాడారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పధకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషంగా ఉన్నదని చెప్పారు.