calender_icon.png 18 September, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం

18-09-2025 01:49:15 AM

రైతు సంక్షేమానికి కేరాఫ్ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాదు సంస్థానం భారతదేశంలో కలిసిన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నీటి కల నెరవేరిందని, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపనతో జిల్లాకు ఖ్యాతి తెచ్చిందని,

భద్రాచలానికి రాకపోకల సౌకర్యం కల్పించేలా రైల్వే లైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఐడిఓసి సమావేశ మందిరంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకల్లో మంత్రి తుమ్మల.. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.