calender_icon.png 10 September, 2025 | 4:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాబుల్లాపురం గ్రామంలో దారుణం..!

10-09-2025 01:44:34 PM

దళిత మైనర్ బాలిక పై అత్యాచారం

పోక్సో కేసు నమోదు చేసిన కనగల్ పోలీసులు 

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా(Nalgonda district) కనగల్ మండలం షాబుల్లాపురం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గణేష్ నిమజ్జన శోభాయాత్రను చూడడానికి వచ్చిన  మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన  సుఖేందర్ కన్నేశాడు. తన ఫోన్ నెంబర్ చూపిస్తూ తనకి ఫోన్ చేయాలని సైగలు చేశాడు. దీంతో ఆ మైనర్ బాలిక  నిరాకరించడంతో ఆ కామాంధుడు  నోరును మూసి పక్కనే ఉన్న బాత్రూంలో తీసుకెళ్లి బలాత్కారం చేశాడు. వెంటనే బాలిక అరుపులు వేయడంతో తల్లిదండ్రులు బాలిక వద్దకు వెళ్లారు. అప్పటికే ఉన్మాదుడి వెంట వచ్చిన మన్నెం రాంబాబు, సోమ చందు స్నేహితులు బాలిక కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడుతుండగా నిందితుడు  సుఖేందర్ సంఘటన స్థలం నుంచి తప్పించుకున్నాడు. వెంటనే మైనర్ బాలిక కుటుంబ సభ్యులు మంగళవారం  కనగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నిందితుడిపై   ఫోక్సో కేసు నమోదు చేసినట్టు సమాచారం.