18-07-2025 01:22:37 AM
భద్రాచలంలో జరిగేది సీతారామ కళ్యాణం కాదు.. లక్ష్మీనారాయణ కళ్యాణం
నిత్య కళ్యాణం, వార్షిక కళ్యాణంలో అర్చకులు ఉచ్ఛరిస్తున్న గోత్రాలపై రగడ
చరిత్రను వక్రీకరిస్తున్నట్లు ఆరోపణలు
* దక్షిణ అయోధ్యగా భద్రాచలం భక్తులకు పరమ పవిత్ర క్షేత్రం. వైకుంఠ రాముడిగా, శంఖుచక్రాలతో నారాయణుడిగా, ధనుర్భాణాలతో శ్రీరాముడిగా భక్తకోటిని తన్మయపరిచే భద్రాద్రి రామయ్య అసలు నామమేమిటి? రామయ్యను ఏ పేరున పిలవాలి? ఏ పేరునా పిలిచినా పలికే ఆర్తజన పరాయణుడే కదా శ్రీరాముడు.. మరి వివాదమేముంది? వివాదం ఉంది, అది ఎడతెగకుండా ఉంది! ‘భద్రాద్రి రామనే వరాయ’ అని చెప్పాల్సిన ప్రవరలను ‘రామనారాయణే వరాయ’ అని పలుకుతుండటంలో అభ్యంతరాలు ముదిరి కోర్టుకేసు దాకా వెళ్లాయి.
* భద్రాద్రి వార్షిక శ్రీరామనవమి కల్యాణంలో శ్రీరామచంద్ర స్వామినే వరయా అని చదివించాల్సి ఉండగా, శ్రీరామ నారాయణ వరయా అని ఉచ్ఛరిస్తున్నారు. అంతేకాదు, లక్ష్మీదేవి గోత్రం సౌభగ్య, నారాయణుడి గోత్రం అచ్యుతలను చదవడం ప్రారంభించారు. సీతాదేవి గోత్రం విశిష్ట.
* శ్రీరాముడు, మోక్షరాముడు, వైకుంఠరాముడు, రామ నారాయణుడు, ఓంకార రాముడు.. మ న భద్రాద్రి రాముడు. హిందువులు ఏ పేరున పిలిచినా పలికే ఇష్టదైవం శ్రీరాముడు. రామనామం హిందువుల జీవన గమనంలో భాగం. రామా లాలి, మేఘా శ్యామలా లి అని తల్లుల జోలపాటవుతాడు రాముడు. సర్వజగద్రక్షడు రాముడేనని పిల్లలకు పెద్దల ఆశీర్వచనంలోనూ శ్రీరా మచంద్రుడు ఉంటాడు.
దక్షిణ అయోధ్యగా ప్రఖ్యాతిగాంచిన భద్రాచలం భక్తులకు పవిత్రక్షేత్రం. భవసాగరాన్ని దాటించే దేవుడు భద్రాచల రామయ్యేనని సాధారణ భక్తు ల నమ్మిక. ఓం నమో నారాయణ అష్టాక్షరి మం త్రం నుం చి ‘రా’ అనే అక్షరాన్ని.. ఓం నమఃశివాయ పంచాక్షరి నుం చి ‘మ’ అనే అక్షరాన్ని కలిపి శివకేశవతత్వం ఇమిడివున్న ‘రామా’ అనే అమృత నామం ఏర్పడిందంటారు.
అనేక విశిష్టతలున్న భద్రాచల స్థల పురాణ శక్తి, రాయుడిపై ప్రజలకున్న భక్తి తరతరాలుగా వన్నె తగ్గని ఓ వెలుగు. గోదా వరి తీరంలో భద్రుడు అనే భక్తుడు కఠోర తపస్సు చేసి వైకుంఠంలోని విష్ణుమూర్తిని శ్రీరాముడిగా ఇక్కడ సాక్షాత్కరింపజేశాడంటారు. శ్రీరాముడి రూపం విష్ణుమూర్తి దర్శనమిచ్చిన తర్వాత, భద్రుడు గోదావరి నదికి అభిముఖంగా పర్వతరూపంలోకి మారిపోయాడని.. ఆ స్థలమే భ ద్రాచలమని చెబుతారు.
వైకుంఠ రాముడిగా.. శంఖుచక్రాలతో నారాయణుడిగా, ధనుర్బాణాలతో శ్రీరాముడిగా భక్తకోటిని తన్మయపరిచే భద్రాద్రి రామయ్య అసలు నామమేమిటి? ఆయనను ఏ పేరున పిలవాలి? ఎలా పిలిచినా పలికే ఆర్తజన పరాయణుడే కదా శ్రీరాముడు.. మరి వివాదమేముంది? వివాదం ఉంది, అది ఎడతెగకుండా ఉంది! ‘భద్రాద్రి రామనే వరాయ’ అని చె ప్పాల్సిన ప్రవరలను ‘రామనారాయణే వరాయ’ అంటుండటంతో అభ్యంతరాలు ముదిరి కోర్టు కేసు దాకా వెళ్లింది.
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 17 (విజయ క్రాంతి): భద్రాచలంలో రాములవారి కల్యా ణం అంటే, తెలుగునాట ‘శ్రీరామ నీ నామ మెంతో రుచిరా’ అనే శ్రీరాముడి కీర్తన అం దరి చెవిన పడుతుంటుంది. వందల ఏళ్ల క్రి తం నుంచి రామదాసుగా ప్రసిద్ధిగాంచిన కంచర్ల గోపన్న రాసిన కీర్తనలు తెలుగునాట ప్రసిద్ధి. భక్తజనం హృదయాల్లో కొలువై వున్న శ్రీరాముడిని ఏ పేరుతో పిలువాలి.
శ్రీ సీతారామచంద్రుడి కల్యాణంలో, ఇటు నిత్యపూజలో భద్రాద్రి శ్రీరామచంద్రున్ని రామనారాయణుడిగా పేర్కొంటూ భక్తకోటి విశ్వాసాలకు విఘాతం కల్గిస్తున్నారనే వివాదం మొదలైంది. శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో జరిగే నిత్యకల్యాణం, ప్రతియేటా జరిగే వార్షిక కల్యాణంలో అర్చ కులు గోత్రనామాలతో జరుగుతున్నది సీతా రామ కల్యాణం కాదని, లక్ష్మీనారాయణ కల్యాణం అని విమర్శ తలెత్తింది.
శ్రీరాముని నామాల ఉచ్ఛారణ, ప్రవరణలను చెప్పే విషయంలో అర్చకస్వాముల మధ్య రెండు వర్గాలు ఏర్పడ్డాయి. మొండి పట్టుదలలు పెరిగాయి. పాలనాధికారుల తీవ్రనిర్లక్ష్యం దీనికి తోడైంది. ఆదినుంచి భద్రాద్రి ఆల యంలో సీతాదేవి గోత్రం వశిష్ట అని పురో హితులు ఉచ్ఛరించేవారు. అధర్వణ వేత పండితుడు గుదిమళ్ల మురళీ కృష్ణమా చార్యలు 20 ఏండ్ల క్రితం భద్రాద్రి క్షేత్ర మంజరి అనే పుస్తకాలన్ని ప్రచురించారు.
ఆ పుస్తకంలో శ్రీరామ అనే పదానికి బదులుగా శ్రీరామనారాయణ అనే పదం ఉపయో గించారు. ఇది వక్రీకరణలో ప్రథమ భాగ మని, ఈ వక్రీకరణను వ్యతిరేకిస్తున్న పురో హితులు చెప్పారు. గుదిమళ్ల మురళీ కృష్ణ మాచార్యులు, చినజీయర్ స్వామి శిష్యు డు.. సహాధ్యాయి. రామనారాయణ వివా దంపై గుదిమళ్ల మురళీ కృష్ణమాచార్యుని వివరణ కోరగా అందుకాయన నిరాక రిం చారు.
2012, 2013లో భద్రాద్రి వార్షిక శ్రీరా మనవమి కల్యాణంలోనూ శ్రీరామచంద్ర స్వామినే వరయా అని చదివించాల్సి ఉండ గా, శ్రీరామ నారాయణ వరయా అని ఉచ్ఛ రించారు. అంతేకాదు, లక్ష్మీదేవి గోత్రం సౌభ గ్య, నారాయణుడి గోత్రం అచ్యుతలను చద వడం ప్రారంభించారు. సీతాదేవి గోత్రం విశి ష్ట. ఇక, 2018 నుంచి రాములవారి నిత్య కల్యాణంలోనూసీతారామచంద్రస్వామివరాయ అనకుండా రామనారాయణ వరయా అంటూ గోత్రాలు చదవడం పరిపా టైంది.
దీంతో చరిత్ర, సంప్రదాయాలను వక్రీకరిస్తు న్నారంటూ రామ భక్తులు, భద్రా ద్రి ప్రాంత పరిరక్షణ సమితి పేరుతో ఆందోళనలు జరి గాయి. ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టిన ప్పటికీ దేవాదాయ ధర్మా దాయ శాఖ అధికారులు, ఆలయ అధికా రులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేయించారు. రామచంద్రస్వామి అనే పదంలో చంద్రుడు అనే పదం మిళితమై ఉంది.
స్వతహాగా వైష్ణ వులైన పురోహితులు శివుడి పదం ఉచ్ఛరిం చడానికి ఇష్టపడరు. ఆ కారణంగానే శ్రీరా మచంద్రస్వామి పదాన్ని వక్రీక రించి శ్రీరా మ నారాయణ అని చదువుతున్నట్టు తెలుస్తోంది. భద్రాచలంలో వెలసినది శ్రీరా మచంద్రుడు కాదు, వైకుఠం నుంచి శ్రీమ న్నారాయణుడే ప్రత్యక్షంగా వెలిశాడని వారు ప్రచారం చేశారు. శ్రీరామచంద్రుడిది అయో ధ్య తప్ప భద్రాచలం కాదని ఆ పురో హితు ల వాదన.
ఈ వాదననూ రామభ క్తులు, భ ద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి తిరస్కరిం చింది. దీంతో వారిపై కోర్టులో కేసు నమో దైంది. హైకోర్టు ఆదేశానుసారం ఐదుగురు సభ్యులతోకూడిన ప్రత్యేక కమిటీ ఏర్పా టైంది. గత ఏడాది జూన్‌లో కమిటీ భద్రా చలంలో పర్యటించి ఇరువర్గాల నుంచి వివ రాలు సేకరించింది. నివేదికను సమర్పిం చింది. భద్రాచల రాముడిపై ఈ వివాదమెం దుకు, నారాయణుడే రాముడు కదా.. ఆ శ్రీ రామచంద్రుడు అందరివాడు కదా అని భక్తజనం అంటున్నారు.
కమిటీ నివేదిక
గోత్ర ప్రవరలపై తలెత్తిన వివా దాన్ని పరిష్కరించాలని జీవీటీ మ నీందర్, మరికొంతమంది దాఖలు చేసిన రిట్ పిటిషన్లను పరిశీలించి తెలంగాణ హైకోర్టు ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. రాష్ట్ర ప్ర భుత్వం ఐదుగురు సభ్యులతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిం ది. ఆ కమిటీ ప్రధాన అర్చకులు, అర్చకులు, వేద పండితులు, 30 మంది అర్చక స్వాములను కలిసి శ్రీ సీతారాముల గోత్ర ప్రవరాల గురిం చి అడిగి తెలుసుకుంది. తమ నివేది కను ఆ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు అందజేసింది.
అధికారులు కల్పించుకోవాలి
భద్రాచలసీతారామచంద్రస్వామి ఆలయంలో తలెత్తిన రామనారా యణ వివాదంపై దేవాదాయ ధర్మా దాయ శాఖ సమగ్ర విచారణ చేసి, చరిత్ర వక్రీకరణ చేసిన వారిపై చర్య లు తీసుకోవాలి.
భూసిరెడ్డి శంకర్ రెడ్డి, భద్రాద్రి ప్రాంత పరిరక్షణ
సమితి అధ్యక్షుడు
కోర్టు పరిధిలో ఉంది
రామనారాయణ వివాదం ప్ర స్తుతం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు ప్రత్యేక కమిటీని నియమించారు. కమిటీ విచారణ చేసింది.
ఎల్ రమాదేవి,
రామాలయం ఈవో