calender_icon.png 10 May, 2025 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిత్య విద్యార్థిగా మొదటి స్థానంలో చామల

17-04-2025 12:37:17 AM

  1. 100%పార్లమెంట్‌కు అటెండ్ అయ్యి మొదటి స్థానంలో ఎంపీ

కాంగ్రెస్ సీనియర్ నాయకులు,పెద్ద అంబర్‌పేట్ మాజీ వైస్ చైర్మన్ సిద్దంకి

అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 16: నిత్య విద్యార్థిగా పార్లమెంట్లో 100% హాజరులో మొట్ట మొదటి స్థానంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిలిచారని పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సిద్ధంకి కృష్ణారెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రతీ పార్లమెంట్ సమావేశానికి హాజరవుతు ప్రజాసమస్యలపై తనదైన మార్క్‌ను చూపించారని అన్నారు.

ఇలా పార్లమెంట్ కు హాజరైన ఎంపీలతో మొదటి స్థానంలో చామల ఉన్నారన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి 79 ప్రశ్నలను సంధించి రెండవ స్థానంలో ఉండగా మొదటి స్థానంలో 80ప్రశ్నలతో ఈటెల ఉండన్నారు. చర్చల విషయంలో 17చర్చలతో రెండవ స్థానంలో ఉన్నారన్నారు.

భువనగిరి, ఆలేరు, జనగాం నుంచి సికింద్రాబాద్ వరకు అప్ అండ్ డౌన్ చేస్తున్న కార్మికులు, ఉద్యోగులు, ప్రయాణికుల కోసం కొన్ని స్టేషన్ లలో ట్రైన్లు ఆగడం లేదని వాటిని ఆపాలని అలాగే రైల్వే అండర్ పాస్‌లు హైదరాబాద్ నుండి రాయిగిరీ (యాదగిరిగుట్ట) వరకు ఎంఎంటిఎస్, పోచంపల్లిలోని చేనేత కార్మికుల ఇక్కత్ సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించారని తెలిపారు.