calender_icon.png 29 July, 2025 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్

29-07-2025 02:02:13 AM

  1. చెస్ వరల్డ్ కప్ ఫైనల్లో కోనేరు హంపిపై విజయం
  2. ఫిడే టైటిల్ నెగ్గిన తొలి భారతీయ మహిళగా రికార్డు
  3. గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన 88వ క్రీడాకారిణిగా గుర్తింపు

జార్జియా, జూలై 28: ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. జార్జియా వేదికగా జరుగుతున్న టో ర్నీలో సోమవారం జరిగిన ఫైనల్లో తన ప్ర త్యర్థి, భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హం పిపై విజయం సాధించింది. ఫైనల్స్‌లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా.. రెండో గేమ్‌లో మొత్తం 75 ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు.

చివరి టై బ్రేకర్‌లో దివ్య తెల్లపావులతో బరిలోకి దిగింది. ఫైనల్స్‌లో దివ్య 1.5 పాయిం ట్లు సాధించగా.. హంపి 0.5 పాయింట్లకే పరిమితమైంది. 2025 ఫిడే మహిళల ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరిన దివ్య దేశ్‌ముఖ్ టోర్నీలో విజేతగా నిలిచి ఫిడే ప్రపంచకప్ సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డులకెక్కింది. తాజా విజయంతో దివ్య గ్రాండ్‌మాస్టర్ హోదాను కూడా అందుకున్నారు.

దీంతో భారత్‌లో ఈ హోదా అందు కున్న 88వ వ్యక్తిగా నిలిచారు. 19 ఏళ్ల దివ్య 2021లో ఇంటర్నేషనల్ మాస్టర్ హో దాను పొందారు. 2023లో ఆసియా చాంపియన్‌షిప్‌లో దివ్య విజేతగా నిలిచింది. ఒలింపి యాడ్‌లో మూడు పసిడి పతకాలు కూడా ఆ మె ఖాతాలో ఉన్నాయి. గతేడాది తొలిసారి 2500 ఎలో రేటింగ్ పాయింట్లు అందుకోవడం విశేషం.