calender_icon.png 29 July, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసి గూడేల్లో భయం భయం!

29-07-2025 02:00:16 AM

మావోయిస్టుల వారోత్సవాలు.. నిఘా పెంచిన పోలీసులు

ఏజెన్సీలో హై అలర్ట్.. ముమ్మరంగా వాహన తనిఖీలు

మణుగూరు, జూలై 28 (విజయక్రాంతి) : గతం ఎంతో ఘనంగా ఉన్న మావోయిస్టు పార్టీ  నేడు వరుస ఎన్‌కౌంటర్లతో పార్టీ అగ్ర నేతలను, వందల సంఖ్యలో క్యాడర్‌ను కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఈ సంక్షోభ సమయంలో ఈ నెల ౨౮ నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సావాలు నిర్వహి స్తోంది. పార్టీ అగ్రనేత చారు మంజుందార్ 1972లో జైలులో కన్నుమూసిన జూలై 28 నుంచి మొదలుకొని ఏటా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.

ఈ వారోత్సవాలలో దేశవ్యాప్తంగా అమరులైన మావోయిస్టులను స్మరించుకుంటూ నివాళులర్పిస్తారు. ప్రస్తుతం పార్టీపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో ఈ ఏడాది ఆరు నెలల కాలంలోనే 16 ఎన్‌కౌంటర్‌లు జరగగా, 206 మంది మావోయిస్టులు మరణించడంతో ఆ పార్టీకి తీరని షాక్ తగిలింది. ఈ క్రమంలో ఈసారి వారోత్సవాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏ వైపు నుంచి ఎలాంటి తుపాకీ మోతలు వినవలసి వస్తుందోనని ఆదివాసి, గిరిజన ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

ఈ వారోత్సవాల సందర్భంగా, నక్సల్స్ దాడులకు పాల్పడే అవకా శం ఉన్నందున, వాటిని తిప్పికొట్టేందుకు పోలీసు యంత్రాంగం  అప్రమత్తమైంది. ఇప్పటికే ఏజెన్సీ జిల్లాలలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నిఘాను మరింతగా పెంచి నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. ప్రధానంగా ములుగు, భద్రాద్రి, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో పోలీసులు అప్రమత్తంగా వ్యవ హరిస్తున్నారు.

గోదావరి తీరం వెంట నిఘా మరింతంగా పెంచి, ఎలాంటి ప్రతిఘటనలైనా, ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలను  సిద్ధం చేశారు. అటువైపు నక్సల్స్, ఇటు భద్రతా బలగాల కదలికలతో ఏజెన్సీలోని గ్రామాలు, గూడే లు ఎప్పుడు ఏం జరుగుతుందోనని వణికిపోతున్నాయి. ప్రధానంగా నక్సల్స్ హిట్ లిస్టులో ఉన్న ప్రజాప్రతినిధులను, రాజకీయ పార్టీల నేతలను పోలీసులు హెచ్చ రించడంతో వారు పట్టణాలకు వలస బాట పట్టారు. ఇప్పటికే ఆర్టీసీ మావోయిస్టు ప్రభావిత ప్రాంత రూట్‌లలో సర్వీసులను రద్దు చేసుకుంది. 

ఏజెన్సీలో హై అలర్ట్.. 

మరోవైపు వారోత్సవాలను విఫలం చేసేందుకు పోలీసు యంత్రాంగం దృష్టి సా రించింది. ములుగు, ఏటూరునాగారం, పినపాక, కరక గూడెం మణుగూరు, సబ్ డివి జన్ పరిధిలోని మండలాల్లోని అటవీ ప్రాం తాల్లో ఇప్పటికే గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, కేం ద్ర బలగాలు కూంబింగ్ నిర్వహిస్తూ మావోయిస్టుల జాడ తెలుసుకునేందుకు గొత్తికో యగూడాల్లో సోదాలు, కార్డన్‌సెర్చ్‌లు చేస్తూ ఆరాతీస్తున్నారు.

మావోయి స్టుల్లో ఎక్కువగా గొత్తికోయలున్న నేపథ్యంలో వారి గూ డాల్లోని గొత్తికోయ పురుషులు, స్త్రీలతో స మావేశమై పరిచయంలేని వ్యక్తులకు ఆశ్ర యం ఇవ్వవద్దని, అనుమానితుల సమాచా రం ఇవ్వాలంటూ అవగాహన కల్పిస్తున్నారు.

ముమ్మరంగా వాహన తనిఖీలు

మావోయిస్టు పార్టీ వారోత్సవాల వేళ భద్రాద్రి జిల్లా చర్ల మండలం ఆర్.కొత్తగూడెం సమీపంలో ప్రధాన రహదారిపై వెలిసిన మావోయిస్టుల బ్యానర్లు కరపత్రాలు కలకలం రేపాయి. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మావోయిస్టులు ఈ బ్యానర్ల ద్వారా పిలుపునిచ్చారు. గడిచిన ఏడాది కాలంలో 194మంది పార్టీ నాయకులు, సభ్యులు హతమయ్యారని వారి సం స్మరణార్ధం గ్రామగ్రామన సంస్మరణ సభలు నిర్వహించాలని కోరారు. 

మావోయిస్టుల బ్యానర్ల ఘటనతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం భద్రాచలం సబ్ డివిజన్ల సరిహద్దుల పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వ హిస్తున్నారు. భద్రాచలం నుంచి చర్ల, వెంకటాపురం, ఛత్తీస్‌గఢ్ వెళ్లే రహదారిలో వాహ నాలను సీఆర్పీఎఫ్ జవాన్లు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పోలీస్ జాగిలాలతో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.