29-07-2025 02:08:18 AM
బెంగళూరు, జూలై 28: నటుడు దర్శన్ అభిమానులు తనను ఆన్‌లైన్‌లో వేధిస్తున్నారంటూ నటి రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలి పారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియాను ఇలా ఉపయోగించడంపై విచారం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో అత్యాచార బెదిరింపులు రావ డం దారుణమన్నారు. ‘ ఈ బెదిరింపులపై నా లాయర్‌తో ఇప్పటికే చ ర్చించాను.
నాకు వచ్చిన బెదిరింపు ల మెసేజ్‌లను పోలీసుల దృష్టికి తీసుకెళ్తాను. ఆ కామెంట్స్ చేసిన వా రిపై ఫిర్యాదు చేస్తాను’ అని తెలిపా రు. గతంలో ఆమె ఇలాంటి వేధింపుల గురించి మాట్లాడారు. ఇలా చేసే వారు తప్పించుకొని తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కామెంట్స్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయన్నారు.