calender_icon.png 26 October, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిరత్నం సినిమాలో చాన్స్

26-10-2025 01:05:22 AM

‘థగ్‌లైఫ్’తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చారు దర్శకుడు మణిరత్నం. కమల్‌హాసన్ హీరోగా, త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్ డ్రామా సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను దక్కించుకుంది. అయితే, ఇప్పుడు డైరెక్టర్ మణిరత్నం తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఈసారి యాక్షన్ డ్రామాతో కాకుండా ప్రేమకథా చిత్రాన్ని రూపొందించనున్నారు.

ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.  కొడైకెనాల్‌లో స్ట్రిప్టు వర్క్ పూర్తయిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి లొకేషన్ స్కౌటింగ్ దాదాపు సెట్ అయిందని సమాచారం. షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుందని టాక్. అయితే, ఇందులో హీరోగా తొలుత ధ్రువ్ విక్రమ్‌ను ఎంపిక చేశారట. కానీ, ఇప్పుడు మరో హీరో కోసం వెతుకుతున్నారని సమాచారం.

ఈ సినిమా తర్వాత ధ్రువ్‌తో మరో యాక్షన్ సినిమా చేసే యోచనతో ఉన్నారట మణిరత్నం. అందుకే ఇప్పుడు తెరకెక్కించబోయే ప్రేమకథకు మరో హీరోను వెతుక్కుంటున్నారని టాక్.  ఇదిలావుంటే, ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం రుక్మిణీ వసంత్ ఎంపికైంది.

ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘కాంతార: చాప్టర్1’లో మహారాణి పాత్రలో మెప్పించిన సంగతి తెలిసిందే. రిషబ్‌శెట్టి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించింది.