calender_icon.png 26 October, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ గేయ రచయితగా డాక్టర్ ఎర్ర హరికిషన్ ఎంపిక

26-10-2025 06:20:42 PM

హరికిషన్ ఎంపిక పట్ల స్నేహితులు, బంధువులు, సర్వత్రా హర్షం

తుంగతుర్తి (విజయక్రాంతి): ఉత్తమ గేయ రచయితగా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన డాక్టర్ ఎర్ర హరికిషన్ ఎంపికయ్యారు. ఈయన రచించిన, అమ్మా ఓ భారతమ్మ, గేయానికి సంస్కృతి విలువలు అందించే సంచార జాతుల కళా ప్రదర్శన విభాగం ఉత్తమ గేయంగా ఎంపిక చేసింది, దీంతో వీరు గజ్వేల్ లో ఆదివారం జరిగిన సంచార జాతుల సమరసత ఉత్సవంలో భాగంగా  మీరు రచించిన గేయానికి ప్రధమ బహుమతిగా ప్రకటించి అఖిలభారత సంచార జాతుల సంచాలకులు అప్పల ప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా జ్ఞాపిక అందించి నగదుతో పాటు శాలువాలతో సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జానపద కళాకారులు, సంచార జాతుల సమన్వయకర్త మంగళంపల్లి శ్రీహరి, బండి రాజుల శంకర్, రామకృష్ణ విద్యాలయం కరస్పాండెంట్ తోపాటు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన జానపద కళాకారులు పాల్గొన్నారు. తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు హరికిషన్ కావడంతో ,స్నేహితులు, బంధువులు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు.