26-10-2025 06:14:09 PM
నకిరేకల్ (విజయక్రాంతి): కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా ఆధ్వర్యంలో శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన బండారు మహేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం కింద అందజేసిన కుట్టు మిషన్ ను ఆదివారం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మృతుని భార్య బండారు స్వప్నకు స్థానిక నర్రా రాఘవరెడ్డి భవనంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, జిల్లా సహాయ కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, ఖానా స్థానిక ప్రతినిదులు నాతి గణేష్, బాల్నే రామచంద్రుడు, బల్గూరి వెంకట్, సంఘం ప్రతినిధులు ఉప్పల గోపాల్, నకిరేకల్ అధ్యక్ష, కార్యదర్శులు కొప్పుల అంజయ్య, గుడుగుంట్ల బుచ్చి రాములు, పొడిసేటి వీరయ్య, టంగుటూరి జానయ్య, కారింగుల పాండు, అయితగోని సత్తయ్య, కారింగుల సైదులు, నిమ్మల సురేష్ పాల్గొన్నారు.