26-10-2025 06:09:37 PM
నేటి యువత అంబేద్కర్ స్ఫూర్తితో జ్ఞానాన్ని పొందాలి..
అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య..
మేడిపల్లి (విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 349వ ఆదివారం జ్ఞానమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ తన మేధస్సును, తన జీవితాన్ని భారతీయుల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దార పోసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి రౌండు టేబుల్ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దళిత, పీడిత, బడుగు, బలహీన వర్గాల దుర్భర పరిస్థితిని, నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వివరించి బ్రిటిష్ పత్రికలు సైతం అభినందించే విధంగా చేసిన మహోన్నత వ్యక్తి, అపర మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, బడుగు, బలహీన వర్గాల పట్ల యావత్ భారత జాతి పట్ల అత్యంత ముందుచూపుతో నిర్విరామంగా కృషి సల్ఫీ అత్యున్నతమైన రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన మహాత్ముడు అంబేద్కర్ అని, ప్రతి భారతీయుడు ప్రతిరోజు అంబేద్కర్ ను, స్మరించుకోవాలని, ప్రతి యువకుడు అంబేద్కర్ స్ఫూర్తితో అత్యున్నత విద్యలను అభ్యసించి విజ్ఞానాన్ని సంపొందించుకోవాలని నత్తి మైసయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో రాపోలు శ్రీరాములు, గరుగుల యాకయ్య, సగ్గు నరసింహ, వై శ్రీనివాస్, బండారి సాయి, ఏ రాజేష్, యేసు రాజు, టిల్లు తదితరులు పాల్గొన్నారు.