18-07-2025 12:54:25 AM
మంచిర్యాల, జూలై 17 (విజయక్రాంతి): జిల్లా అదనపు కలెక్టర్ (రెవె న్యూ)గా పీ చంద్రయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను తన చాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. చంద్ర య్య గతంలో వికారాబాద్ జిల్లా రెవెన్యూ అధికారిగా పని చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)ను జిల్లా పౌరసంబంధాల అధికారి యం కృష్ణమూర్తి మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.