18-07-2025 12:53:26 AM
అదిలాబాద్, జూలై 17 (విజయ క్రాంతి): మహారాష్ర్ట వర్ధలోని మహా త్మాగాంధీ సేవగ్రామ్ ఆశ్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ శాసన స భ్యుడు వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నా రు. నాలుగు రోజుల క్యాంపులో భా గంగా గురువారం శ్రమంలోని గోశాలలో శ్రమదానం చేశారు. ఎమ్మెల్యే స్వయంగా పశువుల పేడను ఎత్తు తూ గోశాల పరిసరాలను శుభ్రం చే శారు. అనంతరం మధ్యాహ్నం భోజ న సమయంలో పర్యాటకులకు ఎ మ్మెల్యే భోజనాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. స్వాతంత్య్ర సంగ్రామానికి సేవాగ్రాం ఆశ్రమం ఊపిరి పోసిందన్నారు. బాపూజీ దేశానికి అందించి న సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అహింసా మార్గాన్ని అనుసరిస్తూ, బాపు చూపిన బాటలో నడవాలని పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే వెంట తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు అంక్షరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.