22-10-2025 01:03:06 AM
-హమాస్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు
-హద్దు మీరితే తుదముట్టిస్తామని స్పష్టీకరణ
వాషింగ్టన్, అక్టోబర్ 21: గాజాలో కాల్పు ల విరమణ ఒప్పందం విషయంలో హద్దు లు దాటితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవా ల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనా ల్ ట్రంప్ తాజాగా హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే హమాస్‌ను తుడిచిపెట్టేస్తామని ఆయన స్పష్టం చేశారు. సుదీర్ఘకాల యుద్ధం అనంతరం ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందం ఉల్లంఘించడంపై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎయిర్‌ఫోర్స్‌వన్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లా డుతూ ‘హమాస్‌తో మేం ఒక ఒప్పందం చేసుకున్నాం. వారు మంచిగా, ప్రశాంతంగా ఉంటారని అనుకుంటున్నాం. అలా జరగకపోతే, అవసరమైతే వారిని తుదముట్టిస్తాం. ఈ విషయం వాళ్లకూ తెలుసు‘ అని తెలిపా రు. కాల్పుల విరమణ ఒప్పందం విజయవంతమయ్యేందుకు అవకాశం ఇవ్వాలనే ప్రస్తుతం ఆగిపోతున్నాన్నారు. కానీ నిరంతర దాడులకు పాల్పడుతూ ఉంటే సహించేది లేదని తేల్చిచెప్పారు.
ప్రత్యర్థులను బహిరంగంగా ఉరితీయడం వంటి చర్యలను వెంటనే ఆపాలని కూడా ఆయన హమాస్‌ను హెచ్చరించారు.అయితే, ఈ విషయంలో అమెరికా సైన్యం నేరుగా జోక్యం చేసుకోదని ట్రంప్ స్పష్టం చేశారు. అవసరమైతే గాజాలో శాంతిస్థాపన కోసం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ దళాలు రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. ‘నేను కోరితే ఇజ్రాయెల్ రెండు నిమి షాల్లో రంగంలోకి దిగుతుంది. కానీ ప్రస్తుతానికి మేం వారికి ఒక అవకాశం ఇస్తున్నాం. వారు హింసను ఆపకపోతే త్వరలోనే కఠిన చర్యలు తప్పవు‘ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం: హమాస్
తాము ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని మరోవైపు హమాస్ చర్చల ప్రతినిధి ఖలీల్ అల్-హయా స్పష్టం చేశారు. మృతదేహాలను వెలికితీయడం చాలా కష్టంగా మారిందని, అయినప్పటికీ తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని తాజాగా ఆయన ఈజిప్టు మీడియా కు వివరించారు.