22-10-2025 01:01:42 AM
-అభివృద్ధి కారిడార్‌గా ‘రెడ్ కారిడార్’ రూపాంతరం
-వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టు విముక్త భారత్
-కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశంలో నక్సలి జం ఇక ముగిసిన అధ్యాయం. వచ్చే ఏడాది మార్చి 31లోపు భారత్ మావోయిస్టు విముక్త భారత్ అవుతుంది. ఒకప్పటి రెడ్ కారిడార్ ఇప్పుడు అభివృద్ధి కారిడార్‌గా మారుతున్నది. విద్యావికాసానికి మారుపేరుగా రూపాంతరం చెందుతున్నది. ఒకప్పు డు అంతర్గత భద్రతకు పెనుసవాల్‌గా ఉన్న మావోయిస్టు సమస్యకు ఎన్డీయే ప్రభుత్వం పరిష్కారం చూపింది’ అని కేంద్ర రక్షణశాఖ రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు.
ఈ విజయం వెనుక పోలీసులు, సీఆర్పీఎఫ్, బీఎస్‌ఎఫ్, డీఆర్జీ బలగాల కృషి ఎంతో ఉందని ప్రశసించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలోని నేషనల్ పోలీస్ మెమోరియల్ స్థలంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో భద్రత సమస్య కంటే, అంతర్గతంగా ఉండే ఉగ్రవాదం, తీవ్రవాదం ఎంతో దేశానికి ముప్పు అని పేర్కొన్నారు.
ప్రజల నమ్మకాన్ని ఎవరు దెబ్బతీయాలని చూసినా, దేశ సమగ్రతకు నష్టం చేయాలని చూసినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలంటే బాహ్య, అంతర్గత భద్రతల మధ్య సమతుల్యత చాలా అవసరమని అభిప్రాయపడ్డా రు. పారామిలటరీ బలగాలు, స్థానిక పరిపాలన సాయంతో నకల్స్ ప్రభావిత ప్రాంతాల ను ప్రగతి బాట పట్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్కడి ప్రజలకు రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు కట్టిస్తున్నా మని వివరించారు.