24-11-2025 07:18:52 PM
ముస్తాబాద్,(విజయక్రాంతి): 69వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలను జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామంలో జరిగిన ఉమ్మడి (4 జిల్లాలు) జిల్లా అండర్ 17 ఖోఖో టోర్నమెంట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన చరణ్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. 23 నవంబర్ నుండి 25 నవంబర్ 2025 వరకు జరిగే 69వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన జి.చరణ్ ఎంపిక అయినట్టు పీడీ కుంట శ్రీనివాస్ తెలిపారు,ఇట్టి ఖో ఖో పోటీలు పంతంగి,యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగుతాయని పేర్కొన్నారు.రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థి చరణ్ ను వ్యాయమ ఉపాద్యాయుడు కుంట శ్రీనివాస్ లను పాఠశాల ప్రధానోపాధ్యాలు సుధాకర్, ఉపాధ్యాయ బృందం, గ్రామ ప్రముఖులు,యువత తదితరులు అభినందించారు.