24-11-2025 07:09:48 PM
నకిరేకల్ (విజయక్రాంతి): ఈనెల 28న సూర్యాపేట పట్టణంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే గీతన్నా రణభేరి సభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల అంజయ్య కోరారు. సోమవారం మండలంలోని నోముల గ్రామంలో రణభేరి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుడుగుంట్ల బుచ్చి రాములు, మండల సహాయ కార్యదర్శి పోలిశెట్టి వీరయ్య, నోముల గౌడ సంఘం చైర్మన్ గుండ గాని జంగయ్య గౌడ్, సొసైటీ అధ్యక్షులు బాదినీ యాదయ్య గౌడ్, ప్రతినిధులు రాచకొండ పాపుల్, కొప్పుల వెంకటేశ్వర్లు, రాచకొండ హుస్సేన్, ఎరుకలి అంజయ్య, భూపతి నరసింహ, రాచకొండ పెద్దలు, ఎల్లమకంటి శంకర్, రాచకొండ సైదులు, పెద్ద సైదులు పాల్గొన్నారు.