24-11-2025 07:02:45 PM
బెల్లంపల్లి అర్బన్: పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ నాయకులు వాపోయారు. సోమవారం రిజర్వేషన్ల వ్యతిరేకిస్తూ బెల్లంపల్లి తహసీల్దార్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బెల్లంపల్లి మండలంలో ఉన్న 17 గ్రామ పంచాయతీలకు గాను, బీసీ రిజర్వేషన్లు సంబంధించి బీసీలకు 42% అంటే 7 సర్పంచి రిజర్వేషన్లు రావాల్సి ఉండగా కనీసం పాత పద్ధతిలో 23% ఇచ్చిన కూడా 4 స్థానాలు రిజర్వేషన్ ఇవ్వాలనీ తెలిపారు. ఇచ్చిన రిజర్వేషన్లలో బెల్లంపల్లి మండలంలో ఉన్న 17 గ్రామ పంచాయతీలకు రెండు రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు అన్యాయం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో బెల్లంపల్లి బీసీ నాయకులు గంధం తిరుపతి, పనస గణేష్ బత్తుల రమేష్ మార్తా బాపు తదితరులు పాల్గొన్నారు.