24-11-2025 07:06:56 PM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..
నకిరేకల్ (విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యమని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. కట్టంగూర్ నకిరేకల్, కేతేపల్లి మండలాల్లో, నోముల గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు, ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంపిణీకి ఆలస్యమైనా కూడా తెలంగాణ ఆడబిడ్డలకు నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేస్తామన్న హామీ నేడు నెరవేర్చారన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నామన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో లక్షల కోట్ల అప్పు
బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో 8 లక్షల కోట్ల అప్పు చేసినా కూడా అభివృద్ధి శూన్యమని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. మండలంలోని నోముల గ్రామంలో మంజూరైన 74 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బిఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేయలేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బాసటగా నిలవాలన్నారు. మన గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకునే దిశగా మనం పార్టీ అభ్యర్థులకు తోడ్పాటు అందజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అశోక్ రెడ్డి మార్కెట్ చైర్మన్ గుత్తా మంజుల మాధవ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు మాజీ జెడ్పిటిసిలు మాదయాదగిరి, సుంకరబోయిన నరసింహ, కోట మల్లికార్జున్, పిఎసిఎస్ డైరెక్టర్ సామ సత్తిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వరకాంతం శేఖర్ రెడ్డి, నకిరేకల్ ,కట్టంగూర్, కేతపల్లి ఎంపీడీవోలు జే. వెంకటేశ్వరరావు, పెరమళ్ళ జ్ఞాన ప్రకాష్ రావు, బి శ్రీనివాసరావు నకిరేకల్ మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ఎస్. కిరణ్ కుమార్, కేతేపల్లి కట్టంగూర్ తహశీల్దారులు రమాదేవి, పుష్పలత డిపిఎం మోహన్ రెడ్డి, ఏపిఎం ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండలు అధ్యక్షుడు నకిరేకంటి ఏసు పాదం, పెద్ది సుక్కయ్య, కంపసాటి శ్రీనివాస్ నాయకులు గాధగొని కొండయ్య, నంద్యాల వెంకటరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి జాన్ రెడ్డి, నాయకులు కుంచం సోమయ్య, సామ రవీందర్ రెడ్డి, యాస కరుణాకర్ రెడ్డి, కొడదల లింగయ్య, కందాల వెంకటరెడ్డి, కె. శ్రీధర్, యానాల ఇంద్రారెడ్డి, యానాల చంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.