calender_icon.png 24 November, 2025 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం దుకాణంకి వ్యతిరేకంగా ధర్నా

24-11-2025 06:51:41 PM

ఉప్పల్ (విజయక్రాంతి): ఉప్పల్ బాగయత్ హెచ్ఎండిఏ లేఔట్ లో నూతనంగా మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడం వ్యతిరేకిస్తూ ఉప్పల్ బాగయత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. ఇండ్ల మధ్య మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయొద్దని వారు డిమాండ్ చేశారు. కాలనీలో మద్యం దుకాణం వద్దు అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తపరిచారు. కాలనీవాసులు మద్దతుగా ఉప్పల్ మాజీ శాసనసభ్యులు ఎన్వీఎస్ ప్రభాకర్ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కాలనీవాసుల కుటుంబ సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు.