24-11-2025 06:41:17 PM
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..
నకిరేకల్ (విజయక్రాంతి): ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని బిఆర్ఎస్ శ్రేణులు విజయవంతం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. సోమవారం కట్టంగూరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని మండల కేంద్రాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి కార్యక్రమానికి ప్రచారం కల్పించాలని సూచించారు.
కేసీఆర్ చేసిన ఉద్యమ పోరాటం, బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన అభివృద్ధి–సంక్షేమాలను ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీక్షా దివస్ సందర్భంగా నకిరేకల్ మండలంలో 100 పడకల ఆసుపత్రి వద్ద, కట్టంగూరులో అయిటిపాముల లిఫ్ట్ వద్ద, నార్కట్‌పల్లి–రామన్నపేటలో సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ వద్ద, చిట్యాల–కేతేపల్లి మండలాల ప్రధాన కూడళ్లలో కేసీఆర్ ఫోటోలకు పాలాభిషేకం చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కట్టంగూరు మాజీ జెడ్పిటిసి తరాల బలరాం, పోగుల నరసింహ పెద్ది బాల నరసింహ, వడ్డే సైదిరెడ్డి, గడస్సు కోటిరెడ్డి, బెల్లి సుధాకర్, గుండగోని రాములు, సైదులు, అంతటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.