calender_icon.png 24 November, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోకాపేటలో రికార్డు ధర.. ఎకరం ఎంతంటే!

24-11-2025 07:05:31 PM

హైదరాబాద్: కోకాపేటలో భూమి రికార్డు ధర పలికింది.కోకాపేటలోని నియోపొలిస్ ప్రాంతంలోని సర్వే నంబర్ 17,18 లోని భూములను తెలంగాణ ప్రభుత్వం సోమవారం వేలం వేసింది. సర్వే నంబర్ 17లోని ఎకరం భూమి ధర రికార్డు స్థాయిలో రూ. 137.25 కోట్లు పలికింది. నియోపొలిస్ లో మొత్తం 41 ఎకరాల విస్తీర్ణంలోని ఆరు ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేసిన సంగతి తెలిసిందే. కోకాపేట్ ప్లాట్లకు ఎకరానికి 99 కోట్ల ఆఫ్ సెట్ ధరతో ఇవాళ ఈ రెండు ప్లాట్లను విక్రయించింది. సర్వే నంబర్ 17లో 4.59 ఎకరాలు, 18లో 5.31 ఎకారాలు ఉంది.మొత్తం 9.9 ఎకరాలకు గానూ 1,355.33 కోట్ల ధర పలికింది.

ఇక డిసెంబర్ 3వ తేదీన ప్లాట్ నంబర్ 24,28 లోని మిగతా ప్లాట్లకు వేలం జరగనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు. గోల్డెన్ మైన్ లోని సైట్-2లో 1.98 ఎకరాలు, మూసాపేటో లోని 11.48 ఎకరాలు, 3.18 ఎకరాల్లోని రెండు సైట్లను వేలం వేయనుంది. గోల్డెన్ మైన్ కు 70 కోట్లు, మూసాపేట్ సైట్ ను 75 కోట్ల చొప్పున హెచ్ఎండీఏ ఆఫ్ సెట్ ధరను ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల రాయదుర్గంలో 7.67 ఎకరాలకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాల సంస్థ(TGIIC) నిర్వహించిన వేలంలో రూ.1,357 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. రాయదుర్గంలో కనీస ఎకరం ధర రూ.101 కోట్లు నిర్ణయించగా, వేలంలో రూ.1.77 కోట్లు పలికింది.