calender_icon.png 24 November, 2025 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్మర్‌గాంకు బస్సు ప్రారంభం

24-11-2025 06:44:43 PM

బెజ్జూర్ (విజయక్రాంతి): సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు సోమవారం బెజ్జూర్ మీదుగా కమ్మర్‌గాం గ్రామానికి బస్సును ప్రారంభించారు. వర్షాకాలంలో రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో ఎమ్మెల్యే రోడ్డుకు మరమ్మతులు చేపట్టడంతో ఆర్టీసీ అధికారులు రోడ్డును పరిశీలించి బస్సులు ప్రారంభించారు. కమ్మర్‌గాం గ్రామానికి ఆర్టీసీ బస్సు ప్రారంభం కావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు.