13 May, 2026 | 3:51 AM

రైల్వే ప్రయాణికులకు చౌకైన ఆహారం

24-04-2024 01:27 AM

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): ప్రయాణికులకు చౌకధ రకే నాణ్యమైన ఆహారం అందించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ మంగళవారం తెలిపారు. సాధారణ ప్ర యాణికులను దృష్టిలో పెట్టుకొని ఈ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో 12 రైల్వే స్టేషన్లలో 23 కౌంటర్ల ద్వారా సేవలను అందించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, దోనే, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆహారం లభ్యమవుతుందని పేర్కొన్నారు.