calender_icon.png 1 August, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రసాయన పరిశ్రమ.. నిబంధనలకు పాతర

31-07-2025 12:44:09 AM

- పేరు లేని పరిశ్రమకు అనుమతులు ఎలా?

- అన్ని తెలిసీ అధికారుల మౌనవ్రతం

-  ప్రమాదాలు జరిగితే బాధ్యులెవరు?

రాజాపూర్, జులై 30: సాధారణంగా ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే సవాలక్ష ఆంక్షలు ఉంటాయి. అనుమతులు, రక్షణ ఏర్పాట్లు, స్థానికు లకు ఉపాధి తదితర నిబంధనలు పాటిస్తేనే ఆ పరిశ్రమ ఏర్పాటుకు మో క్షం లభిస్తుంది. కానీ, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడ శివారులో ఏర్పాటు చేసిన ఓ రసాయ న పరిశ్రమకు పేరే లేదు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే చెప్పుకునేందుకు వివరా లే లేవు. అయినా అధికారులకు ఇవన్నీ కనిపించట్లేదు. తనిఖీల పేరిట పరిశ్రమలకు వెళ్లే సంబంధిత అధికారులు.. ఈ పరిశ్రమ ఎందుకు కనిపించడం లేదోనని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

గతంలో ప్రమాదాలు

రంగారెడ్డిగూడ శివారులోని ఈ పరిశ్రమ గతంలో అనుఫార్మా ప్రైవేటు లిమిటెడ్గా ఉం డేదని, ఇక్కడ రసాయనాలు తయారయ్యేవని స్థానికులు పేర్కొంటున్నారు. గతంలో ఈ పరిశ్రమలో యాసిడ్ ట్యాంక్ పగిలి సమీపంలోని రంగారెడ్డిగూడ మొత్తం విషపూరిత పొగతో నిండిపోయి తీవ్ర వేదన అనుభవించినట్టు గుర్తుచేసుకుంటున్నారు. కళ్లమంట లు, భరించలేని ఘాటైన వాసనతో ఇబ్బందులు పడినట్టు చెప్తున్నారు. కొంతకాలనికి అదే పరిశ్రమలో ఓ ప్రమాదం కారణంగా న లుగురు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారని చెప్పారు. అయితే, కొద్ది రోజులపాటు పరిశ్రమను మూసివేసిన యాజమాన్యం.. రెండు మూడేళ్లు నడిపించారని తెలిపారు. 

కాలం చెల్లిన రియాక్టర్లు, కెమికల్ పైప్లైన్లు..

అదే పరిశ్రమలో టీఎస్ ఐపాస్ అనుమతులతో ఏడేళ్లుగా వివంతా ల్యాబోరేటరీ పేరుతో కొత్త పరిశ్రమను ప్రారంభించారు. అందులో కాలం చెల్లిన రియాక్టర్లు, కెమికల్ పైప్ లైన్లు ఉన్నాయని.. అవి ఎప్పుడు ఎ లాంటి ప్రమాదాలకు దారితీస్తాయోనని రం గారెడ్డిగూడతోపాటు చుట్టు పక్కల గిరిజన తండాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిశ్రమ జాతీయ రహదారిపై ఉన్నా.. దీనివైపు పరిశ్రమలశాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పరిశ్రమకు అతి సమీపం లో పెట్రోల్ బంక్ ఉన్నది. ఈ మధ్య కాలం లో రియాక్టర్ పేలుళ్ల ఘటనలు చూసిన తరువాత ప్రజలు నిత్యం భయంతో వణికిపోతున్నారు. ఈ పరిశ్రమలో ఎంతవరకు రక్షణ పరికరాలు ఉన్నాయో, ఫైర్ ఎక్యూప్మెంట్ ఉందో లేదో నని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. 

నడవట్లే అంటారు.. అనుమతి ఇవ్వరు

ఈ పరిశ్రమ బంద్ ఉన్నదని చెప్తూ ఎవరిని లోపలికి వెళ్లనివ్వడం లేదని స్థానికులు చెప్తున్నారు. పరిశ్రమలో ఏం ఉత్పత్తి జరుగుతుందో ఎవరికీ తెలియదు. పరిశ్రమ పరిస రాల్లో కెమికల్ వాసన, ప్రహరీ పక్కన ఎర్ర గా మారిన మట్టిలో గడ్డి కూడా మొలవడంలేదు. పరిశ్రమ నడవడం లేదని చెప్తూనే గుట్టుచప్పుడు కాకుండా నడపడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి పరిశ్రమపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

కన్నీరు పెట్టుకుంటున్న బాధితులు 

గతంలో ఈ పరిశ్రమలో పనిచేసి ప్రమాదంలో శరీరం కాలిపోయిన ఓంకార్మూర్తి విజయక్రాంతితో తన గోడు వెల్లడించారు. 2014లో అనుఫార్మా ప్రైవేటు లిమిటెడ్లో పనిచేసే సమయంలో, ఒక పెద్ద గాజు ఫ్లాస్క్ లో సల్ఫ్యూరిక్ యాసిడ్తో కొత్త ప్రయోగం చేస్తుండగా.. గాజుఫ్లాస్క్ పగిలి సల్ఫ్యూరిక్ యాసిడ్ తన ఓంటిపై పడి నడుము కిందిభాగం కాలిపోయిందని గుర్తుచేసుకున్నాడు. తనతోపాటు మరో ముగ్గురికి కూడా గా యాలు అయ్యాయని, తాను రెండేండ్లు మం చానికే పరిమితం అయ్యానని వాపోయాడు.

ఆ సమయంలో సంవత్సరన్నర వరకు తనకు జీతం ఇచ్చారని.. ఆ తరువాత పరిశ్ర మ బంద్ అయ్యిందని చెప్పి తనను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రస్తుతం తనకు కుటుంబ పోషణ కూడ ఇబ్బందిగా మారిందని ఆందోళన వ్యక్తంచేశాడు. మళ్లీ ఈ పరిశ్రమలో రసాయనాల ప్రయోగాలు చేస్తున్నట్టు తెలిసిందని, ఇది చాలా ప్రమాదకరమని ఓంకార్ మూర్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

-రెండేళ్ల నుంచి టాక్స్ కట్టట్లే..

గత రెండు సంవత్సరాల నుంచి ఈ కంపెనీకి సంబంధించి ఎలాంటి ట్యాక్సీ కట్టలేదు. నోటీసులు ఇచ్చినప్పటి కూడా స్పందించడం లేదు. ఉన్నతాధికారులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. 

   కేశవులు, పంచాయతీ కార్యదర్శి, రంగారెడ్డి గూడా గ్రామం

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం 

మండలంలోని ఏ గ్రామంలో అయి న నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమ లు నడిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము.నేను కొత్తగా భాద్యతలు చేపట్టిన ఇట్టి పరిశ్రమ పై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటాము

  రాధాకృష్ణ, తహసీల్దార్ రాజాపూర్, మండలం