31-07-2025 12:38:34 AM
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాం తి): పిల్లలు పుట్టని దంపతులు సంతానం కోసం పడే తపనను అనేక ప్రైవేట్ హాస్పిటళ్లు సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా సరోగసి విధానంలో బిడ్డను కని ఇస్తామని చెప్పి వేరే వాళ్లకు పుట్టిన బిడ్డను ఇచ్చిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించడంతో ఇప్పు డు అందరి దృష్టి ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలపై పడింది.
పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫర్టిలైజేషన్) సేవలు అందిస్తున్న ప్రభుత్వ దవాఖానల సే వలపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అధికారికంగా 358 ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లు ఉండ గా... కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలో గాంధీ, పేట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటళ్లలో ఐవీఎఫ్ సేవలను ఏర్పా టు చేశారు.
వరంగల్ ఎంజీఎంలోనూ ఏ ర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. కోట్ల ఖర్చుతో సర్కారు అం దుబాటులోకి తెచ్చిన ఐవీఎఫ్ సేవలను వినియోగించుకోవాలని సర్కారు కోరుతోంది.
రూ.16 కోట్లతో ఐవీఎఫ్ కేంద్రాలు
గాంధీ జనరల్ హాస్పిటల్‌లో గత ఏడాది అక్టోబర్ 15న, పేట్లబుర్జులో డిసెంబర్ 9న ఐవీఎఫ్ సేవలను ప్రారంభించారు. వరంగల్‌లో ఐవీఎఫ్ సెంటర్ ప్రారంభం కోసం కసరత్తు చేస్తున్నారు. మూడు కేంద్రాలకు కలిపి రూ.16 కోట్ల నిధులను విడుదల చేశారు. ఒక్కో సెంటర్‌కు దాదాపుగా రూ.5.5 కోట్ల ఖర్చుతో అత్యాధునికంగా యంత్రాలు, సౌకర్యాలు కల్పించారు.
హైదరాబాద్‌లోని రెండు కేంద్రాల్లో ఎంబ్రయాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఇతర వైద్యులు, సిబ్బందిని నియమించా రు. ఫాలిక్యులర్ స్టడీ, ఐయూఐ, ఐవీఎఫ్ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్‌గా కనీసం 50 మందికి తగ్గకుండా ఐవీఎఫ్ సేవలు పొందుతున్నారు.
ఐవీఎఫ్ కేంద్రాల్లో సేవలు..
సంతానం లేని వారు వైద్యులను సంప్రదిస్తే వారి సమస్యను గుర్తించి మొదట ఓవు లేషన్ ఇండక్షన్ ప్రక్రియ (గర్భధారణకు అవసరమైన అండాల విడుదల కావడం) ద్వారా మందులతో సహజంగా గర్భధారణకు ప్ర యత్నిస్తారు. తర్వాత దశలో ఓవులేషన్ సమయంలో ఇంట్రా యుటరైన్ ఇన్సెమినేషన్ (ఐయూఐ) ద్వారా శుద్ధి చేసిన స్పెర్మ్‌ను నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ లో ప్రయత్నిస్తారు.
పై రెండు దశల్లో సంతా న అవకాశం లేనప్పుడు ఐవీఎఫ్ అనే టెస్ట్ ట్యూబ్ విధానంలో చికిత్స అందిస్తారు. ఇందుకు సుమారు 3 వారాల సమయం పడుతుంది. ప్రైవేటులో రూ.2.5 నుంచి రూ.5 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. ఈ చికిత్సను సైతం గాధీ, పేట్లబుర్జులో ఉచితంగా అందిస్తున్నారు.
అధునాతన ల్యాబ్‌ల ఏర్పాటు..
ఎంబ్రియాలజీ ల్యాబ్, ఐవీఎఫ్ ఆపరేషన్ థియేటర్, ఆండ్రాలజీ ల్యాబ్‌లతోపాటు ఫలదీకరణ చేసేందుకు అవసరమైన ఆధునిక ఎక్విప్‌మెంట్, సెమన్ ఎనాలసిస్ యంత్రాలు, రీఏజెంట్స్ (ద్రావకాలు) డయాగ్నోస్టిక్ హిస్టరీ లాప్రోస్కోపీ, అల్ట్రాసౌండ్, కంట్రోల్ వేరియంట్, హైపర్ స్టిమిలేషన్ (సీఓఏ)లను సమకూర్చారు. గాంధీలో కేవలం ఇంట్రా యుటెరిన్ ఇన్‌సెమినేషన్ (ఐయూఐ) ప్రక్రి య మాత్రమే చేస్తున్నారు. భర్త వీర్యాన్ని ల్యాబ్‌లో శుద్ధి చేసి భార్య గర్భాశయం వద్ద నేరుగా ప్రవేశపెడతారు. ఐవీఎఫ్‌తో పోలిస్తే ఇది చాలా తేలికైన విధానం.
ఐవీఎఫ్ క్లిష్టమైన ప్రక్రియ..
ఐవీఎఫ్ ప్రక్రియ చాలా క్లిష్టమైనది. మహిళ నుంచి అండాలను, పురుషుల నుం చి స్పెర్మ్‌ను సేకరించి వాటిని ల్యాబ్‌లో ఫలదీకరణ చెందేందుకు ప్రయత్నం చేయాలి. ఇందుకోసం అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐవీఎఫ్ కోసం ఎంబ్రియోకల్చర్, మందులు, డిస్పోజబుల్ కేథటార్లు ఇతరత్రా మెడికల్ సామాగ్రిని సమకూర్చుకోవాలి. ఇందుకు ఒక్కో ఐవీఎఫ్‌కు కనీసం రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వీటిని కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
ప్రభుత్వ సేవలను వినియోగించుకోండి
సంతానం లేని దంపతులు ప్రైవేట్ ఆస్పత్రులను బదులు ప్రభుత్వాసుపత్రిలోని సంతాన సౌఫల్య కేంద్రం ఐవీఎఫ్ సెంటర్‌ను సంప్రదించాలి. ఉచితంగా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి లక్షల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టుకొని చివరికి తమ వద్దకు వస్తున్నారు. గాంధీలో ఐవీఎఫ్ సెంటర్‌కు వచ్చిన వారిలో ఇప్పటి వరకు 35 మందికి గర్భధారణ అయ్యింది.
9 మందికి ఓవమ్ (అండాలను సేకరించే ప్రక్రియ) పూర్తి అయ్యింది. 22 మందికి ఐయూఐ చికిత్స అందిస్తే ఇద్దరికి విజయవంతమైంది. ఇక నలుగురికి ఐవీఎఫ్ చేస్తే అందులో ఒకరు ప్రస్తుతం 7 వారాల గర్భంతో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్, బ్లడ్ టెస్ట్, హార్మోనల్ టెస్ట్, అండాశయ అభివృద్ధి ట్రాకింగ్, ఐయూఐ, ఐవీఎఫ్ సేవలు అందిస్తున్నాం. పిల్లలు లేరనే వేదన ఎంతో బాధాకరం. ఆ పరిస్థితి నుం చి వారి ని బయటపడేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.
ప్రొఫెసర్ శోభ,
హెచ్‌వోడీ, గైనకాలజీ,
గాంధీ జనరల్ హాస్పిటల్