calender_icon.png 24 January, 2026 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఓ వరం

24-01-2026 10:08:35 PM

కల్మల్ చెరువులో బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ

గరిడేపల్లి,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఓ వరం లాంటిదని మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మూలగుండ్ల సీతారాం రెడ్డి అన్నారు. మండలంలోని కల్మలచెరువు గ్రామంలో బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన చెక్కులను శనివారం పార్టీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. అనారోగ్య కారణంగా చికిత్స పొందిన బాధితుల కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నిధుల నుంచి రూ.1,85,000 చెక్కులను పంపిణీ చేశారు.

గ్రామానికి చెందిన లబ్ధిదారులు బొల్లగాని సైదమ్మ, చిలకమర్రి సరిత, నూకల వెంకటరెడ్డి, మహేశ్వరపు దుర్గయ్య, మీసాల లక్ష్మీనారాయణ లకు సంబంధిత చెక్కులను అందజేశారు. బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందుతున్న సహాయం ఎంతోమంది బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని ఆయన అన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మీసాల యోహాన్, ఉప సర్పంచ్ కందుకూరి కృష్ణారెడ్డి, మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆరే కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు అమరవరపు నవీన్, గుణ గంటి వెంకటమ్మ,గొల్ల గాని వెంకన్న, అనంత్ సరిత, యాతం శ్రీకాంత్, అమరవరపు విమలమ్మ, పార్టీ నాయకులు బొల్లగాని సైదులు, నగేష్, అమరవరపు రాము, అమరవరపు నగేష్,ప్రేమ్ కుమార్, నరసింహారావు, రామ్ రెడ్డి,వెంకట్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రాములమ్మ, యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.