24-01-2026 09:58:40 PM
సంగారెడ్డి,(విజయక్రాంతి): అందోల్ పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన భూనీళా సమేత శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సామాన్య భక్తులతో కలిసి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో తిలకించారు.
అనంతరం శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వాతావరణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో మార్కెఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, సురేందర్ గౌడ్, ఎస్. కృష్ణారెడ్డి, చిట్టిబాబు, రామకృష్ణ, ప్రవీణ్, మున్నూరు కిషన్, ప్రదీప్ గౌడ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.