24-01-2026 09:50:53 PM
- రూ.3.40 కోట్లతో అభివృద్ధి పనులు
- బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో రూ. 200కోట్ల తో యంగ్ ఇండియా ఆశ్రమ స్కూల్ రూ.18 కోట్లపై చిలుక నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపన పర్వం కొనసాగుతోంది. శనివారం బెల్లంపల్లిలో పలు వార్డుల్లో తలపెట్టిన అభివృద్ధి పనులను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో రూ.3.40 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో యుఐడిఎఫ్ (UIDF) డిఎంఎఫ్ (DMFT) నిధుల ద్వారా మంజూరైన పలు అభివృద్ధి పనులను ఆయన రమారామిగా శంకుస్థాపనలను ప్రారంభించారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 20,21,22,23 వార్డులకు సంబంధించిన బూడిది గడ్డ బస్తీ, ఏఎంసీ సమీపంలో రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజ్, అదేవిధంగా 29,30,31,32 వార్డుల్లోనీ హనుమాన్ బస్తీ – బాబు క్యాంప్, హనుమాన్ గుడి సమీపంలో రూ. 45 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజ్ 28,33,34 వార్డుల పరిధిలో హనుమాన్ బస్తీ గ్రంథాలయం సమీపంలో రూ.40 లక్షలతో రోడ్డు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అలాగే 3,17,18 వార్డులకు సంబంధించి రూ.1 కోటి 85 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు, డ్రైనేజ్ 15,16 వార్డులకు సంబంధించిన టేకులబస్తీ, రామాలయం గుడి సమీపంలో రూ. 20 లక్షలతో రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడారు.బెల్లంపల్లి పట్టణాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండదన్నారు. ప్రతి వార్డులో అవసరమైన రోడ్లు, డ్రైనేజ్ సదుపాయాలు కల్పించి పట్టణాన్ని పరిశుభ్రంగా, అభివృద్ధి పథంలో నడిపిస్తాననీ వెల్లడించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి, నాణ్యమైన పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జే సంపత్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు, మాజీ చైర్ పర్సన్ స్వరూప, పీసీసీ నాయకులు చిలుముల శంకర్, జిల్లా నాయకులు ముని మంద రమేష్ ,మాజీ కౌన్సిలర్లు గెల్లీ రాయలింగు, బొడ్డు నారాయణ అధికారులు పాల్గొన్నారు.