24-01-2026 09:44:15 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల నియోజకవర్గంలో 2025-26 సంవత్సరానికి గాను SMAM (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజెషన్)లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదగా ప్రారంభించారు. అర్హులైన రైతులకు 6 పవర్ టిల్లర్లు, 6 రోటవేటర్లు, 52 పవర్ స్ప్రేయర్లు, 16 బ్రష్ కట్టర్లు జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ తో కలిసి పంపిణీ చేశారు.
మంచిర్యాల నియోజకవర్గ రైతులకు 16.24 లక్షల విలువచేసే 81 సబ్సిడీ పరికరాలు అందజేశారు. ఈ కార్యక్రమములో మంచిర్యాల ఏఎంసి చైర్మన్ పయ్యావుల పద్మ ముని, ఆత్మ బిఎఫ్ఏసి ఛైర్మన్ సింగతి మురళి, మంచిర్యాల సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం. కృష్ణ, నియోజక వర్గ మండల వ్యవసాయ అధికారులు మహేందర్, కృష్ణ, శ్రీకాంత్, రంజిత్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.