calender_icon.png 24 January, 2026 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రావాలి

24-01-2026 10:02:02 PM

బీజేపీ కౌన్సిలర్ లను గెలిపించి బీజేపీ చైర్మెన్ చేస్తే MLA తో కలిపి ట్రిబుల్ ఇంజన్ సర్కారు వస్తుంది

అప్పుడే ఏ ఆటంకం లేకుండా అభివృద్ధి అవుతుంది

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది

కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో త్రిపుల్ ఇంజన్ సర్కారు రావాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లాలోని మున్సిపల్ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల తో  సమావేశం నిర్వహించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి లో ట్రిబుల్ ఇంజన్ సర్కారు రావాలనీ అన్నారు. ప్రతి వార్డులో బీజేపీ కౌన్సిలర్ లను గెలిపించి బీజేపీ అభ్యర్థిని చైర్మెన్ చేస్తే MLA తో కలిపి ట్రిబుల్ ఇంజన్ సర్కారు వస్తుందనీ అన్నారు. అప్పుడు ఏ ఆటంకం లేకుండా అభివృద్ధి అవుతుందనీ అన్నారు.

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుందనీ ప్రతి వార్డులో బీజేపీ కార్యకర్త గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పని చేయాలని అన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, బిజెపి ఇంచార్జ్ విపుల్ రెడ్డి, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, కుంట లక్ష్మారెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షులు మోటూరి శ్రీకాంత్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.