calender_icon.png 25 January, 2026 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశీ శిక్షణ తరగతులను ప్రారంభించిన జిల్లా వ్యవసాయధికారి భాగ్యలక్ష్మి

24-01-2026 09:56:30 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలోని 40 వ్యవసాయ డీల్లర్లకు దేశీ డిప్లొమా కోర్స్ శిక్షణ తరగతులను శనివారం రోజున కరీంనగర్ జిల్లా వ్యవసాయధికారి జె భాగ్యలక్ష్మి జ్యోతి ప్రజల్వాన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా వ్యవసాయదికారి జె భాగ్యలక్ష్మి మాట్లాడుతూ డీల్లరు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపోందించుకొని రైతులకు సరైన సూచనలను తెలియజేలానే ఉద్దేశ్యంతో, ఈ దేశీ డిప్లొమా కోర్సు ను సంవత్సరకాలం పాటు మేనేజ్, సమ్మెతి, ఆత్మ రైతు శిక్షణ కేంద్రం ద్వారా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయండం జరిగింది.

వారంలో ఒక రోజు జరిగే శిక్షణ తరగతికి వివిధ పరిశోధన కేంద్రాల నుండి శాస్త్రవేత్తలు వచ్చి బోధన చేయడం జరుగుతుంది.అదే విధంగా క్షేత్ర సందర్శన కు కుడా వివిధ  వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు డీల్లర్లను తీసుకువెళ్ళి పరిజ్ఞానాన్ని తెలియజేయడం జరుగుతుందని అన్నారు. తదుపరి ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. ఛత్రునాయక్ మాట్లాడుతూ డీల్లరు ప్రతి వారం తప్పనిసరిగా తరగతులకు హాజరు కావాలని, విషయం పరిజ్ఞానం పెంపోందించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిడిఎ రైతు శిక్షణ కేంద్రం ఓ వి ఎస్ ఉషారాణి, శాస్త్రవేత్త రాంప్రసాద్, వెంకటేశ్వర్లు, ఫెసిలిటెటర్ రాంచందర్ రావు, ఉద్యనఅధికారి అయిలయ్య మరియు వ్యవసాయధికారులు మమత, అనూష హాజరయ్యారు.